Sunday, March 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎల్లమ్మగల్లి-అవల్గావ్ రోడ్డుకు మోక్షం

ఎల్లమ్మగల్లి-అవల్గావ్ రోడ్డుకు మోక్షం

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని ఎల్లమ్మ గల్లి ప్రాంతం నుండి ఆవల్గావ్ రోడ్డుకు వెళ్లే దారి పూర్తిగా ముళ్ళ వదలతో మూసుకుపోయింది. ఈ దారి గత కొన్ని సంవత్సరాల కాలంగా నడవరాన్ని పరిస్థితి మొత్తానికి దారి అసలే లేకుండా పోయింది. ఇలాంటి ఇబ్బందికరమైన దారిని సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి ప్రత్యేక చొరవ చూపుతూ గ్రామ ముళ్ళ పొదలను తొలగిస్తూ ఎల్లమ్మ గల్లి నుండి అవల్గావ్ రోడ్డు వరకు మొరం రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఈ రహదారి శుభ్రతతో ఎల్లమ్మ గల్లి వాసులంతా సర్పంచ్ పనితీరుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారి ఆ గల్లి వాసులకే కాకుండా గ్రామ ప్రజలకు ఇతర గ్రామాల నుండి మద్నూర్ కు రావడం వెళ్లడం మధ్యదారిగా ఎంతో ఉపయోగకరమైనది అంటున్నారు. ఈ రహదారిని ఏండ్ల తరబడి ఏ ఒక్కరు పట్టించుకోలేదని, సర్పంచ్ చొరవతో రహదారికి మోక్షం లభించిందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -