No menu items!
Sunday, August 24, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeతెలంగాణ రౌండప్పోతునూరులో ఘనంగా యోగా దినోత్సవం..

పోతునూరులో ఘనంగా యోగా దినోత్సవం..

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని శనివారం  పోతునూరు ప్రాథమికోన్నత పాఠశాలలో యోగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు,ఏఏపిసి సభ్యులు కమ్యూనిటీ ప్రజలు,గ్రామ పెద్దలు పాల్గొని  యోగ దినోత్సవం విజయవంతం చేశారు. జూన్ 21 వేసవి కాలం ఉత్తర అర్ధగోళంలో సంవత్సరంలో అతి పొడవైన రోజు సమతుల్యత మరియు పునరుద్ధరణకు ప్రతీకగా ఉంటుందని, ఇది యోగా యొక్క ప్రధాన సూత్రాలను ప్రతిబింబిస్తుందని తెలిపారు. ఇది ఈ ప్రపంచ వేడుకకు సరైన రోజుగా మారిందని, యోగా మానసిక బలం ను మరియు శరీరక బలాన్ని పెంచుతుందని తెలిపారు. ఇది మనషి ఏకాగ్రత మరియు స్వీయ నియంత్రణను మెరుగుపరుస్తుంది. ప్రతి రోజు యోగా చేయటం వలన రోగనిరోధక శక్తి మరియు శక్తిని పెంచి, శ్వాస వ్యాయామాలు ఒత్తిడిని తగ్గిస్తాయి మరియు మనస్సుకు విశ్రాంతినిస్తాయని ప్రధానోపాధ్యాయులు వెంకట్రామ్ నాయక్ తెలియచేసారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు రామ్మూర్తి, గులామ్ అంజాద్, ధర్మారెడ్డి పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad