- Advertisement -
జీవితాన్ని ఇచ్చేవాడా, విను
నీ ప్రపంచంతో నా మనసు విరిగిపోయింది
నేను బ్రతికినట్టే ఉండి చనిపోయాను
రాత్రులు గడిచిపోవు
పగళ్ళు విడిచిపోవు
నువ్వు నాకు మానని గాయాన్ని ఇచ్చావు
కళ్ళు నిస్సారం, హదయం కలతలమయం
కావలసినంత దుఃఖం ఇచ్చావు
ఎవరో గారడి చేసినట్లు.
జీవితాన్ని ఇచ్చేవాడా, విను
నాకు తెలియకుండానే
నువ్వు నా ఆనందాన్ని లాక్కున్నావు
జీవితమైతే ఇచ్చావు కానీ
జీవితాన్ని లాక్కున్నావు
నా హదయాన్నే పోటు పొడిచావు
ఎంతకాలం మౌనంగా ఉండాలి నేను
దాన్ని ఎందుకు ఎదురుపడి చెప్పకూడదు?
నా ఆనందాన్ని చూసి
నువ్వు అసూయపడ్డావు.
జీవితాన్ని ఇచ్చేవాడా విను
-మూలం: షకీల్ బదాయిని
అనువాదం: ఏనుగు నరసింహారెడ్డి
- Advertisement -