Friday, April 10, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఆంక్షలతో గెలవలేరు

ఆంక్షలతో గెలవలేరు

- Advertisement -

ఇరాన్‌ అణు ఇంధన సంస్థ చీఫ్‌ మొహమ్మద్‌ ఎస్లామీ
టెహ్రాన్‌
: తమపై ఆంక్షలు విధించి శత్రువులు విజయం సాధించలేరని, అణు ఇంధనాన్ని పరిరక్షించుకోవడం మా హక్కు అని ఇరాన్‌ అణు ఇంధన సంస్థ అధిపతి మొహమ్మద్‌ ఎస్లామీ స్పష్టం చేశారు. అమెరికాతో జరిపే ఎటువంటి కాల్పుల విరమణ చర్చల్లోనూ తమ హక్కుల పరిరక్షణే అత్యవసర అంశంగా ఉండాలని చెప్పారు. కాల్పుల విరమణ ప్రతిపాదనల్లో యురేనియం శుద్ధి అంశాన్ని అమెరికా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఇరాన్‌ అణు ఇంధన సంస్థ చీఫ్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మరోవైపు, ఇస్లామాబాద్‌ వేదికగా అమెరికా-ఇరాన్‌ మధ్య శుక్రవారం చర్చలు జరిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే.
మౌలిక సదుపాయాలను దెబ్బతీస్తాం.. లెబనాన్‌ను ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహు మరోసారి హెచ్చరించారు. తమను లక్ష్యంగా చేసుకుంటే తీవ్ర ప్రతిఘటన తప్పదన్నారు. లెబనాన్‌లోని మౌలిక సదుపాయాలను దెబ్బతీస్తామన్నారు. రాజధాని బీరుట్‌లో జరిపిన దాడుల్లో హిజ్బుల్లా కీలక నేత నయీమ్‌ ఖాసిం సన్నిహితుడు అలీ యూసఫ్‌ హతమైనట్టు నెతన్యాహు వెల్లడించారు. ఆయన ఖాసింకు సమీప బంధువు అని సమాచారం. అయితే, దీనిపై హిజ్బుల్లా నుంచి ఎటువంటి స్పందన లేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -