- Advertisement -
నవతెలంగాణ – బజార్ హాత్నూర్
క్షయ( టీబీ )వ్యాధిపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని, జాగ్రత్త వహిస్తే పూర్తిగా నయమవుతుందని జిల్లా టీబి అధికారి డాక్టర్ సుమలత అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 41 మందికి టీబీ పరీక్షలు నిర్వహించి కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండు వారాలపాటు దగ్గు, సాయంత్రం జ్వరం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం ఉంటే స్థానిక ఆరోగ్య కేంద్రంలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. వ్యాధి నిర్థారణ అయితే ఆరు నెలల పాటు చికిత్స తీసుకుంటే నయమవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్యులు శిల్ప, హెచ్ఈఓ సూర్య ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -