Saturday, March 7, 2026
E-PAPER
Homeఖమ్మంపదో తరగతిలోనే మీ బంగారు భవిష్యత్తుకు పునాది వేసుకోవాలి: సర్పంచ్

పదో తరగతిలోనే మీ బంగారు భవిష్యత్తుకు పునాది వేసుకోవాలి: సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – బోనకల్ 
ఇష్టంతో కష్టపడి పాఠశాలకు మీ కుటుంబాలకు మంచి పేరు తీసుకురావాలని బోనకల్ సర్పంచ్ బానోతు జ్యోతి, ఉపసర్పంచ్ బానోతు కొండ, 9 వ వార్డు సభ్యురాలు జరుపుల లావణ్య, శివకృష్ణ దంపతులు అన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని బోనకల్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు వారు శుక్రవారం హాల్ టికెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బానోతు జ్యోతి, బానోతు కొండ మాట్లాడుతూ.. విద్యార్థులు అందరూ కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని అప్పుడే తల్లిదండ్రుల లక్ష్యం నెరవేరినట్లు అవుతుందన్నారు.

పదో తరగతిలోనే మీ బంగారు భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని, ఇక్కడ పునాది గట్టిగా లేకపోతే ముందు ముందు రాణించలేరు అన్నారు. చదువు బంగారు భవిష్యత్తుకు బాట వేస్తుంది అన్నారు. పరీక్షలు రాసేటప్పుడు విద్యార్థులు ఎటువంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండాలన్నారు. ఆందోళన చెందటం వలన పరీక్షలు బాగా రాయలేరని దీని ఫలితంగా పరీక్షలో తప్పే ప్రమాదం ఉందన్నారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు నగదు బహుమతులను ప్రకటిస్తున్నట్లు వారు తెలిపారు.

బోనకల్ మండల స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థికి రూ.10,016 లు, బోనకల్ హై స్కూల్ స్థాయిలో ప్రధమ స్థానాన్ని సాధించిన విద్యార్థికి రూ.5,016 లు అందజేస్తామని తెలిపారు.అదేవిధంగా తొమ్మిదో వార్డు సభ్యులు జరుపుల లావణ్య, శివకృష్ణ దంపతులు కూడా విద్యార్థులను విద్యార్థులను ప్రోత్సహించేందుకు నగదు బహుమతులను ప్రకటించారు. బోనకల్ మండల స్థాయిలో ప్రధమ స్థానాన్ని సాధించిన విద్యార్థికి రూ. 5,016 లు, బోనకల్ హై స్కూల్ స్థాయిలో ప్రధమ స్థానాన్ని సాధించిన విద్యార్థికి రూ. 3,016 లు అందజేస్తామని ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి కోలా రాజేశ్వరి, సి ఆర్ వై ఆర్గనైజేషన్ సభ్యులు కె. రాణి, బి. ఉష, బోనకల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అట్లూరి గోపీచంద్, ఉపాధ్యాయులు, గ్రామస్తులు మోర్ల నరసింహారావు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -