- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలంలో గురువారం ప్రేమించి పెళ్లి చేసుకున్న జుత్తుక లీలాప్రసాద్ (21), జుత్తుక సౌమ్య (19) దంపతులు లారీ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. ఆధార్ నవీకరణ నిమిత్తం రాజానగరం వచ్చిన వీరు, నరేంద్రపురం కూడలిలో హైవే దాటుతుండగా, అతివేగంగా వస్తున్న లారీ వీరి స్కూటీని ఢీకొంది. వీరికి మూడు నెలల పాప కూడా ఉంది. తల్లిదండ్రులను కోల్పోయిన ఆ చిన్నారి పరిస్థితి చూసి బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహాలను రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
- Advertisement -



