నవతెలంగాణ-వెల్దుర్తి
అప్పుల బాధతో ఓ యువ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం చేరిలా గ్రామంలో గురువారం జరి గింది. ఎస్‌ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మిర్జాపల్లి బాబు (35) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇల్లు కట్టుకొని, రెండు ఎకరాల పొలం కొన్నాడు. వాటి కోసం రూ.25లక్షలు అప్పుచేయగా రూ.5 లక్షలు చెల్లించినా ఇంకా రూ.20లక్షల అప్పు ఉంది. ఈ క్రమంలో రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసి అప్పులు తీరుద్దామను కున్నాడు. పంటలు సరిగ్గా పండకపోవడంతో అప్పులు తీర్చలేకపోయాడు. అప్పు ఇచ్చిన వారు పదేపదే అడగడంతో మనస్తాపానికి గురయ్యాడు. కాగా, రోజులాగే గురువారం కూడా పొలానికి నీరు పారపెట్టేందుకు ఉదయం వెళ్లిన బాబు.. చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చుట్టుపక్కల రైతులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సమాచారం అందుకొని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రి తరలించారు. భార్య షేకమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. మృతునికి ఓ కూతురు, కుమారుడు ఉన్నారు.
అప్పుల బాధతో యువరైతు ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES