- Advertisement -
నవతెలంగాణ-పూడూర్
ప్రేమించిన యువతకి మరో యువకుడితో వివాహం నిర్ణయించారని మనస్థాపానికి గురైన ఓ యువకుడు పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పూడూరు మండల కేంద్రంలోని బీజాపూర్ హైవే రహదారి పక్కన సోమవారం రాత్రి మృతి చెందడం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం తిమ్మారెడ్డి గూడ గ్రామనికి చెందిన సంజీవ(32) సోమవారం సాయంత్రం గ్రామం నుండి 6 గంటలకు ఎవరికి చెప్పకుండా వెళ్లిపోవడం జరిగింది. గత వారం రోజుల క్రితం ప్రేమిస్తున్న యువతికి మరో యువకుడితో వివాహం నిర్ణయించారని మనస్థాపానికి గురైన యువకుడు పురుగుల మందు సేవించి ఉంటాడని గ్రామస్తులు పేర్కొన్నారు.
- Advertisement -

                                    

