- Advertisement -
నవతెలంగాణ – చిన్న శంకరంపేట
డెంగ్యూతో పోరాడి యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని ఎస్ కొండాపూర్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కుమ్మరి ప్రభాస్ తండ్రి శ్యామ్ వయస్సు 20 సంవత్సరాలు గత వారం రోజుల నుండి డెంగ్యూతో బాధపడుతూ.. హైదరాబాదులోని ఓ ప్రయివేట్ దవాఖానాలో చికిత్స పొందుతూన్నాడు. రక్త కణాలు తగ్గడంతో ఆదివారం మృతి చెందినట్లు తెలిపారు.
- Advertisement -