నవతెలంగాణ – జమ్మికుంట
జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన హమాలీ శివశంకర్(25) అనే యువకుడు వ్యవసాయ బావిలో పడి మృతి చెందాడు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన శివశంకర్ గత కొద్ది సంవత్సరాలుగా రైళ్లలో సమోసాలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. చిన్నతనంలోనే తండ్రి చనిపోగా తల్లి లతతో కలిసి కొత్తపల్లిలోని బీడీ కాలనీలో నివాసం ఉంటున్నాడు. సమోసాలు అమ్ముకొని జీవనం కొనసాగిస్తున్న శివశంకర్ మద్యానికి బానిస కావడంతో కుటుంబ సభ్యులు అది మానుకోవాలని హెచ్చరించడంతో కుటుంబ సభ్యులను బెదిరించేందుకు ఆత్మహత్య చేసుకుంటానని, వ్యవసాయ బావిలో దూకగా, ఈత రాకపోవడంతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ ఎస్ రామకృష్ణ గౌడ్ తెలిపారు.
బావిలో పడి యువకుడు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES