Monday, December 1, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఅనుమానాస్పద స్థితిలో యువతీయువకుడు మృతి

అనుమానాస్పద స్థితిలో యువతీయువకుడు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపల్ పరిధిలో ఓ యువతీయువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. బిహార్‌కు చెందిన కార్మికుడి ఇద్దరు కుమార్తెలు స్థానిక బిస్కెట్ పరిశ్రమలో పని చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం తండ్రి ఇంటికి రాగా లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. కిటికీలోంచి చూడగా ఓ గదిలో కుమార్తెతో పాటు మరో గుర్తుతెలియని యువకుడి మృతదేహాలు కనిపించాయి. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. యువకుడు అమ్మాయిని హత్యచేసి, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -