Thursday, December 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉంగరం గుర్తు వైపు చూస్తున్న యువత 

ఉంగరం గుర్తు వైపు చూస్తున్న యువత 

- Advertisement -

నవతెలంగాణ – గోవిందరావుపేట 
మండల కేంద్రంలో యువత కొత్త తరం వైపు మార్పు కొరకు ఉంగరం గుర్తు వైపు చూస్తున్నారని బి ఆర్ ఎస్ సర్పంచ్ అభ్యర్థి మెరిట్ కిరణ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో పలు వార్డులలో కిరణ్ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ ప్రధానంగా యువత మార్పును కోరుకుంటున్నారని అన్నారు. అభివృద్ధి వైపు వేగంగా అడుగులు వేసే పరిపాలన కావాలని కోరుకుంటున్నారని అన్నారు.  ఈ ప్రచారంలో మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద నాయక్ పాల్గొని మాట్లాడుతూ పోరిక రవి కిరణ్ గోవిందరావుపేట గ్రామ అభివృద్ధి కోసం ముందుకు వచ్చారని అన్నారు.

మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల కంటే ఎక్కువ సంఖ్యలో రెట్టింపు స్థాయిలో కిరణ్ పాఠశాలలో విద్యార్థులు చదువుతూ ఉన్నారు అంటే విద్యాభివృద్ధిలో కిరణ్ పాత్ర ఏంటి అనేది మండల వ్యాప్తంగా అందరికీ తెలుసని అన్నారు. అంత క్రమశిక్షణతో విద్యాబుద్ధులు నేర్పుతున్న వ్యక్తి సర్పంచిగా వస్తే ఆ గ్రామాభివృద్ధి ఎంత వేగంగా జరుగుతుంది అనేది ప్రజలు ఆత్రుతతో ఎదురుచూస్తున్నారని అన్నారు. గ్రామ అభివృద్ధిలో కిరణ్ మార్క్ తప్పకుండా చూపిస్తారని అందుకు మీ ఆశీస్సులు కావాలని అన్నారు. ఉంగరం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -