- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: క్రియేటివ్ థియేటర్ వ్యవస్థాపకులు రచయిత & దర్శకులు, నటులు అజయ్ మంకెనపల్లి “కాజానా రంగ పురస్కార్ సమారోహం – 2025” పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ మేరకు బెంగళూరు
కాజానా(రి) అధ్యక్షులు డా. బేలూరీ రఘునందన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవార్డు ప్రదానోత్సవం కాజానా కావ్య , నాటకరంగ, సినీ రంగాలకు చెందిన ప్రతిభావంతులకు 2025 సంవత్సరానికి గాను ఎంపిక చేసినట్టు రఘునందన్ తెలిపారు. అవార్డు ప్రదానోత్సవం డిసెంబర్ 5 నుండి 7 వరకు షిమోగాలో ఉంటుందని వారు పేర్కొన్నారు.
- Advertisement -



