Thursday, July 31, 2025
E-PAPER
Homeజాతీయంమీ ప్రవర్తన నమ్మశక్యంగా లేదు

మీ ప్రవర్తన నమ్మశక్యంగా లేదు

- Advertisement -

జస్టిస్‌ వర్మపై సుప్రీంకోర్టు అసహనం
న్యూఢిల్లీ :
ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన ఘటనలో అంతర్గత విచారణ ప్యానెల్‌ చేసిన సిఫారసు రాజ్యాంగ విరుద్ధమని జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ పేర్కొనడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. రాజ్యంగ విరుద్ధమని భావిస్తే విచారణకు ఎందుకు హాజరయ్యారని, దీనిపై ముందే సవాల్‌ చేయాల్సిందని పేర్కొంది. జస్టిస్‌ వర్మ ప్రవర్తన నమ్మశక్యంగా లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. నోట్ల కట్టలు దొరికిన వ్యవహారంలో త్రిసభ్య విచారణ కమిటీ ఇచ్చిన నివేదికను సవాల్‌ చేస్తూ జస్టిస్‌ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా బుధవారం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. జస్టిస్‌ వర్మ తరఫు వాదించిన న్యాయవాది కపిల్‌ సిబల్‌, న్యాయమూర్తిని తొలగించాలని.. అంతర్గత విచారణ ప్యానెల్‌ చేసిన సిఫారసు రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఆయన తొలగింపు ప్రక్రియ విధానం ప్రమాదకర ఉదాహరణగా నిలిచిపోతుందని అన్నారు. దీనిపై జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ ఏజీ మసిV్‌ాలతో కూడిన ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. జస్టిస్‌ వర్మ ప్రవర్తన నమ్మశక్యంగా లేదని పేర్కొంది. న్యాయపరమైన తప్పులు జరిగినప్పుడు దానిపై చర్య తీసుకునే హక్కు భారత ప్రధాన న్యాయమూర్తికి ఉంటుందని జస్టిస్‌ దత్తా ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ పిటిషన్‌కు సంబంధించిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం రిజర్వ్‌ చేసింది.
అంతకుముందు సోమవారం విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం, పలు ప్రశ్నలు సంధించింది. విచారణ పూర్తయి నివేదిక విడుదలయ్యే వరకు జస్టిస్‌ వర్మ ఎందుకు వేచి ఉన్నారని, కమిటీ నియామకం జరిగినపుడు సుప్రీంకోర్టుకు ఎందుకు రాలేదని, అలాగే విచారణ కమిటీ ముందు ఎందుకు హాజరయ్యారని అడిగింది. ‘సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో ఉంచిన వీడియోను తొలగించాలని ఆశ్రయించారా?’ అంటూ వర్మ తరఫున న్యాయవాది కపిల్‌ సిబల్‌ను బెంచ్‌ నిలదీసింది.
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ ఇంటి ఆవరణలో కాలిపోయిన నోట్ల కట్టలు దొరికాయి. మంటలు ఆర్పేందుకు వెళ్లిన సిబ్బంది వాటిని గుర్తించారు. ఈ ఘటనపై అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్‌ ఖన్నా అంతర్గత విచారణ కోసం ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ 10 రోజుల పాటు సుదీర్ఘంగా 55 మంది సాక్షులను విచారించింది. వర్మ అధికారిక నివాసంలో అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశాన్ని సందర్శించిన కమిటీ నోట్ల కట్టలు దొరికింది వాస్తవమేనని తేల్చింది. ఫలితంగా రాజీనామా చేయాల్సిందిగా జస్టిస్‌ వర్మకు సీజేఐ సూచించగా, ఆయన తిరస్కరించారు. దీని ఆధారంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్‌ ఖన్నా యశ్వంత్‌ వర్మకు అభిశంసనకు సిఫారసు చేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీకి లేఖ రాయగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -