బ్రిట్టాస్‌కు మలయాళంలో అమిత్‌షా ప్రత్యుత్తరం
తిరువనంతపురం : సీపీఐ (ఎం) నాయకుడు, కేరళకు చెందిన రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిట్టాస్ రాసిన ఓ లేఖకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా మలయాళంలో ప్రత్యుత్తరమిచ్చారు. కేంద్ర హోం మంత్రి ఈ విధంగా మలయాళంలో తన స్పందన తెలియజేయడం ఇదే మొదటి సారి. ఏడు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల జైలుశిక్ష విధించే నేరానికి సంబంధించి ఛార్జిషీటు దాఖలైతే ఆ వ్యక్తి యొక్క ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) రిజిస్ట్రే షన్‌ను రద్దు చేయాలంటూ హోం శాఖ ఇచ్చిన ఆదేశాలలో చట్టపరమైన లోపాలు ఉన్నాయని బ్రిట్టాస్ తన లేఖలో ఎత్తిచూపారు. అక్టోబర్ 22న బ్రిట్టాస్ ఈ లేఖ రాస్తూ ఆ ఆదేశాలను సమీక్షించి రద్దు చేయాలని కోరారు. రాజ్యాంగం ఇచ్చిన హామీలను ఆ ఆదేశాలు ఉల్లంఘిస్తున్నాయని తెలిపారు. ఓసీఐ కార్డును కలిగి ఉన్న వారిని ప్రభావితం చేసే ఏ చర్య అయినా చట్టపరమైన నిర్ధారణ ఆధారంగానే ఉండాలి తప్ప కేవలం విధానపరమైన చర్యల ఆధారంగా కాదని బ్రిట్టాస్ తన లేఖలో వివరించారు. బ్రిట్టాస్ లేఖపై అమిత్ మలయాళంలో స్పందిస్తూ లేఖ అందిందని ప్రత్యుత్తరం ఇచ్చారు. అయితే అందులో ఇతర వివరాలేవీ లేవు.
మీ లేఖ అందింది
- Advertisement -
- Advertisement -



