‘సినిమా బండి’ ఫేమ్ దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల ‘పరదా’ అనే మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో వస్తున్నారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ మేకర్స్ రాజ్, డికె మద్దతు ఇస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా, దర్శన రాజేంద్రన్, సంగీత ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజరు డొంకడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రీలిజైన గ్లింప్స్, టీజర్, సాంగ్స్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు మేకర్స్ థర్డ్ సింగిల్ ‘ఎగరేరు నీ రెక్కలే..’ పాటని రిలీజ్ చేశారు.
సంగీత దర్శకుడు గోపీ సుందర్ మనసు హత్తుకునేలా అద్భుతంగా కంపోజ్ చేశారు. వనమాలి రాసిన లిరిక్స్ మీనింగ్ ఫుల్‌గా ఉన్నాయి. రితేష్ జి రావు తన వోకల్స్‌తో మెస్మరైజ్ చేశారు. అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, సంగీత జర్నీ ఎమోషనల్ అండ్ హార్ట్ టచ్చింగ్‌గా వుంది. అద్భుతమైన లోకేషన్స్‌లో చిత్రీకరించిన ఈ సాంగ్ విజువల్‌గా చాలా గ్రాండ్‌గా ఉండటంతో ఈ సాంగ్ ఇన్‌స్టంట్‌గా హిట్ అయ్యింది. ఈ నెల 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది అని చిత్ర యూనిట్ తెలిపింది.
రాగ్ మయూర్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి దర్శకత్వం: ప్రవీణ్ కాండ్రేగుల, నిర్మాతలు: విజరు డొంకాడ, శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువ,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రోహిత్ కొప్పు, సంగీతం: గోపీ సుందర్, సాహిత్యం: వనమాలి, రచయితలు: పూజిత శ్రీకాంతి, ప్రహాస్ బొప్పూడి, స్క్రిప్ట్ డాక్టర్: కష్ణ ప్రత్యూష, డీవోపీ: మదుల్ సుజిత్ సేన్, ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల
సౌండ్ డిజైన్: వరుణ్ వేణుగోపాల్, ఆర్ట్ డైరెక్టర్: శ్రీనివాస్ కళింగ.
‘ఎగరేరు నీ రెక్కలే..’
- Advertisement -
- Advertisement -