నవతెలంగాణ – మాక్లూర్
మండలంలోని గంగరమంద గ్రామానికి చెందిన దత్రిక అభినయ్ (20) అనే యువకుడు బైక్ కోనివ్వలేదని చింత చెట్టుకు ఊరి వేసుకొని ఆత్మహత్య మంగళవారం రాత్రి చేసుకున్నట్లు ఎస్సై రాజశేఖర్ బుదవారం తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. మృతుని తండ్రి అతని చిన్నప్పుడే మృతి చెందారు. అతని తల్లి మరో వివాహం చేసుకొని మృతుని అమ్మమ్మ వద్ద వదిలినట్లు తెలిపారు. ఆమె పెంచి పెద్ద చేసిందని, మృతుడు ఇంటర్ వరకు చదువుకొని పెయిల్ అయ్యాడని, అప్పటి నుంచి కూలీ పని చేసుకుంటూ జీవనం కొన సాగిస్తున్నాడు. అతని అమ్మమ్మ తో బైక్ కొనివ్వలని కోరగా ఆమె ఇప్పుడు డబ్బులు లేవని మళ్ళీ కొనుకుందువని చెప్పిందన్నారు. మనస్తాపంతో గ్రామ శివారులోని హనుమాన్ మందిరం దగ్గర గల చింత చెట్టుకు ఊరి వేసుకొని మృతి చెందినట్లు తెలిపారు. మృతుని అమ్మమ్మ కాపుకారు చంద్ర పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
బైక్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES