- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండల కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు ఆదేశాల మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కొరకు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఈ నెల 6న ధర్నా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ పాల్గొనేందుకు జుక్కల్ మండల కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు సతీష్ పటేల్ ఆధ్వర్యంలో యువజన విభాగం నాయకులు ఢిల్లీకి బయలుదేరారు. ఈ కార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సతీష్ పటేల్,కాంగ్రెస్ పార్టీ జిల్లా యూత్ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి (చిన్న )యూత్ కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్, సురేష్, ప్రసాద్, గంగాధర్ తదితరులు ఉన్నారు.
- Advertisement -