- Advertisement -
నవతెలంగాణ ఇల్లందు: పొలానికి ద్విచక్ర వాహనంపై వెళ్తూ విద్యుదాఘాతంతో వాహనంతో సహా దగ్ధమై యువకుడు మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో చోటుచేసుకుంది. సీఐ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం….శంభునిగూడెం పంచాయితీ వెన్నెలబైలు గ్రామానికి చెందిన పర్సిక రాజు (35) ద్విచక్ర వాహనంపై వ్యవసాయ పొలం వద్దకు వెళ్తుండగా.. విద్యుత్ హై టెన్షన్ తీగల తగలడంతో ద్విచక్ర వాహనం దగ్ధమై అక్కడికక్కడే మృతి చెందాడు. మంటల్లో కాలిపోతున్న యువకుడిని చూసి కుటుంబ సభ్యులు, బంధువులు రోదిస్తున్న తీరు అందరినీ కలచివేసింది. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
- Advertisement -