- Advertisement -
నవతెలంగాణ – జన్నారం: హైదరాబాద్ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మంచిర్యాల జిల్లా జన్నారం మండలం మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన రాంటెంకి సిద్దార్థ్ (20) అనే విద్యార్ధి మృతి చెందాడు. మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్ధార్థ్ హైదరాబాద్ లో బీటేక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. మంగళవారం రాత్రి సిద్ధార్థ్ పని మీద బైక్ పై వెళ్తుండగా షాద్ నగర్ సమీపంలో ఎదురుగా వస్తున్న ఆటో ఢీ కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు అని తెలిపారు.
- Advertisement -



