Thursday, January 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యువత క్రీడల్లో రాణించాలి

యువత క్రీడల్లో రాణించాలి

- Advertisement -

– కమ్మర్ పల్లి ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్ 
– గ్రీన్ ఫీల్డ్ క్రికెట్ క్లబ్ సీజన్–8 టోర్నమెంట్ విజేత జగ్గసాగర్ 
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
యువత క్రీడల్లో రాణించడం ద్వారా జీవితంలో పైకి ఎదుగవచ్చని, క్రీడలు యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తాయని కమ్మర్ పల్లి ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్ అన్నారు. మండల కేంద్రంలోని గ్రీన్ ఫీల్డ్ మినీ స్టేడియంలో గ్రీన్ ఫీల్డ్ క్రికెట్ క్లబ్ సీజన్–8 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడం, స్నేహభావాన్ని బలపరచడం, ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించడమే ప్రధాన ఉద్దేశ్యంగా టోర్నమెంట్ నిర్వహించిన గ్రీన్ ఫీల్డ్ క్రికెట్ క్లబ్ సభ్యులను అభినందించారు.

ఇలాంటి టోర్నమెంట్లు నిర్వహించడం వల్ల యువతలో క్రీడా స్ఫూర్తి, స్నేహభావం పెంపొందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.అనంతరం గ్రీన్ ఫీల్డ్ క్రికెట్ క్లబ్ సీజన్–8 క్రికెట్ టోర్నమెంట్ విజేతగా నిలిచిన జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం జగ్గసాగర్ జట్టుకు, రన్నర్ గా నిలిచిన బాల్కొండ మెండోరా  జట్టుకు బహుమతులను ప్రధానం చేశారు.కార్యక్రమంలో గ్రీన్ ఫీల్డ్ క్రికెట్ క్లబ్ సీజన్–8 క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు భరత్ రెడ్డి, భరద్వాజ్, నర్సన్న, చైతన్య, రంజిత్, రుగ్వేద్, సురేష్, భరత్ కావల్ల, వంశీ, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -