Saturday, July 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చెడు వ్యసనాలకు యువత దూరంగా ఉండాలి 

చెడు వ్యసనాలకు యువత దూరంగా ఉండాలి 

- Advertisement -

డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ 
నవతెలంగాణ – కట్టంగూర్
యువత డ్రగ్స్, గంజాయి, ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లకు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ పిలుపునిచ్చారు. గంజాయి, డ్రగ్స్, వద్దు ఆరోగ్యం ముద్దు నినాదంతో డివైఎఫ్ఐ చేపట్టిన యువ చైతన్య సైకిల్ యాత్ర శుక్రవారం కట్టంగూరు మండల కేంద్రానికి చేరుకుంది వారికి స్థానిక డివైఎఫ్ఐ నాయకులు ఘన స్వాగతం పలికారు.

అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడారు.యువత డ్రగ్స్ గంజాయి, బెట్టింగ్ యాప్ లకు వ్యసనపరలుగా మారి వారి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉందని అలాంటి యువత మత్తుకు బానిస కావొద్దు అన్నారు. మత్తులో విచక్షణ కోల్పోయి తన సొంత వాళ్ళ మీద కూడా హత్యలు, హత్యాచారాలు చేస్తూ వారి భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని చెప్పారు.

యువతకు డ్రగ్స్ , గంజాయి, బెట్టింగ్ యాప్ ల పై అవగాహన కల్పించేందుకు తమ సంఘం ఆధ్వర్యంలో చైతన్య యాత్ర చేపట్టినట్లు తెలిపారు కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు గద్దపాటి సుధాకర్,ఆఫీస్ బేరర్స్ శ్రీకర్, గుండు నరేష్, కట్ల లింగస్వామి, మహేష్ వంగూరు చంద్రశేఖర్, సిఐటియు మండల కన్వీనర్ సులోచన, ఆరోగ్య మిత్ర చెరుకు శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు జాల ఆంజనేయులు, సింగర్ గోపి ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -