- Advertisement -
నవతెలంగాణ – కట్టంగూర్
యువత గంజాయి, డ్రగ్స్, మత్తుపదార్థాలకు ఆన్లైన్ బెట్టింగ్స్, లోన్ యాప్ లకు దూరంగా ఉండాలని స్థానిక ఎస్సై మునుగోటి రవీందర్ సూచించారు. డీవైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆరు నియోజకవర్గాలు, 25 మండలాల వ్యాప్తంగా నిర్వహించనున్న యువ చైతన్య యాత్ర పోస్టర్ ను బుధవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.సమాజ మార్పు కోసం, డ్రగ్స్, గంజాయి, ఆన్లైన్ మోసాల బారిన పడకుండా యువతలో చైతన్యం నింపేందుకు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర చేపట్టడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లాఉపాధ్యక్షుడు గద్దపాటి సుధాకర్, నాయకులు గంట మల్లేష్, కక్కిరేణి స్వామి, సూరారపు విగ్నేష్ ఉన్నారు.
- Advertisement -