Sunday, July 13, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్Youtube: యూట్యూబర్స్‌కు కొత్త రూల్స్..

Youtube: యూట్యూబర్స్‌కు కొత్త రూల్స్..

- Advertisement -

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్: జూలై 15 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయని యూట్యూబ్ కంపెనీ స్పష్టం చేసింది. కాగా చాలా కాలంగా తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటోంది. AI సహాయంతో సృష్టించబడిన నాణ్యత లేని కంటెంట్, స్పామ్ వీడియోలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటోంది. ఈ వీడియోలు ప్లాట్‌ఫామ్ నాణ్యతను తగ్గించడమే కాకుండా.. ఒరిజినల్ సృష్టికర్తల ఆదాయాలను కూడా ప్రభావితం చేస్తున్నాయి. ఇప్పుడు యూట్యూబ్ అటువంటి కంటెంట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
తాజా రూల్స్ ప్రకారం..
కాపీ చేసిన కంటెంట్​ ఎడిట్ చేసి పోస్ట్ చేయాలనుకుంటే అనుమతి ఇవ్వదు. ఒకే వీడియోను ఎక్కువసార్లు అప్​లోడ్ చేయలేరు. టెంప్లెట్, రోబోటిక్ వాయిస్​లతో చేసిన వీడియోలకు అనుమతి లేదు. తప్పుడు సమాచారం, ఎంటర్​టైన్​మెంట్ లేని వీడియోలు అనుమతించదు. ఫేస్ చూపించకుండా స్పామ్ కంటెంట్​ చేస్తోన్న చానెల్స్​కు అనుమతి ఉండదు. ఇకపోతే ఏఐ జనరేటెడ్ వీడియోలు చేయొచ్చు. కానీ ఏఏ ఎఫెక్ట్స్ వాడొచ్చు? ఎప్పుడు ఎఫెక్ట్ పడదు అనేది ఇంకా క్లారిటీ లేదు. మొత్తానికి ఈ రూల్స్ మాత్రం ఈ నెలలో అమలు అయ్యే అవకాశం ఉంది.  ఎల్లుండి (జులై 15) నుంచి కొత్త కంటెంట్​కు ప్రాధాన్యత ఇవ్వనుంది. కొత్త విషయం చెప్పే వీడియోలు, ఎడ్యుకేషన్, క్రియేటివిటీ, ఎంటర్​టైన్​మెంట్ వంటి అంశాలను మాత్రమే అనుమతిస్తుంది. కంటెంట్ స్పెషల్​గా, ఉపయోగకరంగా ఉంటేనే యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదించొచ్చు. 
గూగుల్ ఏఐ మోడ్: ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లో దూసుకెళ్తోంది. ఈ క్రమంలో గూగుల్ మరో సరికొత్త టూల్ పరిచయం చేసింది. అది కూడా మనకోసం.. అవును! భారతీయ యూజర్ల కోసం గూగుల్ కొత్త ఏఐ మోడ్ టూల్​ తీసుకొచ్చింది. ఈ ఏఐ మోడ్​ ఇన్ సెర్చ్​ను గూగుల్ సెర్చ్​ ఇంజిన్​లో కలిపేసింది. యూజర్లు అడిగిన ప్రశ్నలకు సెర్చ్ రిజల్ట్స్ డీటెయిల్డ్ ఆన్సర్స్​ ఇస్తుంది. ఈ టూల్​ని ఈ ఏడాది మొదట్లో అమెరికాలో లాంచ్ చేసింది గూగుల్. తర్వాత పోయిన నెలలో సెర్చ్ ల్యాబ్స్ ద్వారా భారత్​లో కూడా అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఈ ఇంగ్లిష్ వెర్షన్​లో మాత్రమే ఉంది. ఇది ఎలా పనిచేస్తుందంటే.. ప్రశ్న ఎలా అడిగినా, కంటెంట్​ని లోతుగా విశ్లేషించి వివరణాత్మకమైన సమాధానాలు ఇస్తుంది.


గూగుల్ జెమిని 2.5 మోడల్ వెర్షన్ ద్వారా ఇది పనిచేస్తుంది. అడిగిన ప్రశ్నకు వెబ్ మొత్తం సమాచారాన్ని సేకరిస్తూనే ఉప–ప్రశ్నలుగా డివైడ్​ చేస్తుంది. తర్వాత సమాధానం ఇస్తుంది. అవసరమైన లింక్​లు, ఇతర ప్రశ్నలతో మరింత సెర్చ్ చేసేందుకు ఆప్షన్లను అందిస్తుంది. దీన్ని వాడేందుకు టెక్స్ట్‌‌‌‌‌‌‌‌ టైపింగ్ లేదా వాయిస్ ఇన్​పుట్ ఇవ్వొచ్చు. గూగుల్ లెన్స్ ద్వారా ఫొటోలను అప్​లోడ్ చేయొచ్చు. నార్మల్ సెర్చ్ రిజల్ట్స్ కంటే ఎక్కువే కంటెంట్ ఇస్తుంది. ఈ ఫీచర్ ‘క్వెరీ ఫ్యాన్ అవుట్’ అనే టెక్నిక్​ ఆధారంగా పనిచేస్తుంది. గూగుల్ సిస్టమ్​ ఒక ప్రశ్నను డివైడ్ చేస్తుంది. తద్వారా మల్టీ సెర్చ్ చేయొచ్చు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -