నవతెలంగాణ-హైదరాబాద్: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ (MGNREGA) పథకాన్నీ..వీబీ జీ రామ్ జీ మార్పు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మోడీ సర్కార్ తీసుకొచ్చిన మార్పులపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ తెచ్చిన చట్టానికి, బీజేపీ తెచ్చిన కొత్త చట్టానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని ఎద్దేవా చేశారు.కొత్త చట్టం ప్రకారం ఉపాధిని హక్కుగా కాకుండా, కేంద్రం దయాదాక్షిణ్యాలపై ఆధారపడేలా మార్చారని ఆమె మండిపడ్డారు. కార్పొరేట్ శక్తులకు, కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకే కేంద్రం ఈ కొత్త విధానాన్ని తెచ్చిందని విమర్శించారు. ఈ ‘నల్లచట్టాన్ని’ వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, ఏపీసీసీ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆమె ప్రకటించారు. ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, ఇతర పార్టీలను కలుపుకుని ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
మోడీ తెచ్చిన ‘వీబీ జీ రామ్ జీ’పై వైఎస్ షర్మిల సెటైర్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



