హీరో శర్వానంద్ నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘బైకర్’. ఏప్రిల్ 3న థియేటర్లలో విడుదల కానున్న ఈచిత్రం ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో యువి క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రం భారతదేశంలో మొట్టమొదటి మోటోక్రాస్ మూవీ, హై-ఆక్టేన్ రేసింగ్ యాక్షన్‌తో పాటు అద్భుతమైన ఎమోషన్స్ ఉన్న కథ. శర్వాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, మేకర్స్ ‘జిద్ది జిద్ది’ అనే సరికొత్త ట్రాక్‌ను రిలీజ్ చేశారు. ఈ పాట సినిమా ఆల్బమ్‌లో ఒక స్ఫూర్తిదాయక మోటివేషనల్ ఆంథమ్‌గా నిలుస్తోంది. జిబ్రాన్ స్వరపరిచి పాడిన ఈ పాటలో షెన్‌బగరాజ్, అరవింద్ శ్రీనివాస్, సుదర్శన్ రామ్ కూడా వోకల్స్ అందించారు.
కృష్ణకాంత్ రాసిన ఈ సాహిత్యం లక్ష్యాలను సాధించేందుకు అవసరమైన పట్టుదల, ధైర్యం, నిరంతర ప్రయత్నాన్ని ప్రతిబింబిస్తోంది. పాటలోని మాంటేజ్‌లో శర్వా ఒక ప్రొఫెషనల్ మోటోక్రాస్ రేసర్‌గా మారే ప్రయాణాన్ని అద్భుతంగా చూపించారు. కఠినమైన వర్కౌట్స్, ఎండ్యూరెన్స్ రన్స్ చేయడం, వర్క్‌షాప్‌లో తన డర్ట్ బైక్‌ను స్వయంగా రిపేర్ చేయడం వంటి సన్నివేశాలు అతని అంకితభావం, క్రమశిక్షణను హైలైట్ చేస్తున్నాయి. ఈ ట్రైనింగ్‌లో రాజశేఖర్ ఒక మెంటర్‌గా కనిపిస్తూ శర్వా ప్రోగ్రెస్‌ను పర్యవేక్షించడం ఎమోషన్‌ని మరింత పెంచింది. అద్భుతమైన రిథమ్, ఆకట్టుకునే విజువల్స్‌తో ఈ పాట విడుదలైన వెంటనే అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంటోంది అని చిత్రయూనిట్ పేర్కొంది.
స్ఫూర్తినింపేలా ‘జిద్ది జిద్ది..’
- Advertisement -
- Advertisement -



