నవతెలంగాణ-కమ్మర్ పల్లి: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో శనివారం కమ్మర్ పల్లి జోనల్ స్థాయి వాలీబాల్ కబడ్డీ ఎంపిక పోటీలను నిర్వహించారు. ఈ జోనల్ స్థాయి ఎంపిక పోటీల్లో మోర్తాడ్, ఏర్గట్ల, కమ్మర్ పల్లి మండలాలకు చెందిన ఆయా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.వాలీబాల్ అండర్-14 బాలుర, బాలికల విభాగంలో ఎంపికలు నిర్వహించారు. కబడ్డీ అండర్-17 బాలుర, బాలికల విభాగంలో ఎంపికలు నిర్వహించారు. జోనల్ సెక్రటరీ, స్థానిక పాఠశాల ఫిజికల్ వేముల నాగభూషణం ఆధ్వర్యంలో ఆయా విభాగాల్లో పాల్గొని క్రీడాకారులను ఎంపిక చేశారు. ఎంపిక పోటీల్లో మంచి ప్రతిభ కలిగిన క్రీడాకారులను వాలీబాల్ అండర్-14, కబడ్డీ అండర్-17 విభాగాల్లో పాల్గొనే కమ్మర్ పల్లి జోనల్ స్థాయి జట్లను ఎంపిక చేసినట్లు పిడి నాగభూషణం తెలిపారు. ఇంతకుముందు ఈ ఎంపిక పోటీలను స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పసుపుల సాయన్న ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.కార్యక్రమంలో మోర్తాడ్, ఏర్గట్ల, కమ్మర్ పల్లి మండలాల ఫిజికల్ డైరెక్టర్లు ఆనంద్, శ్యామ్, నాగేష్, మాధురి, పీఈటిలు గోపాల్, జ్యోతి, రమేష్ గౌడ్, బాలు, సంజీవ్, ప్రేమ్ కుమార్, నాగేష్, సుమన్, తదితరులు పాల్గొన్నారు.
జోనల్ స్థాయి వాలీబాల్, కబడ్డీ ఎంపిక పోటీలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



