నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని 30 గ్రామ పంచాయతీల కు జరిగిన ఎన్నికలలో ఎన్నికైన గ్రామ సర్పంచులను మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో జడ్పీ సీఈవో చందర్రాథోడ్ గ్రామ సర్పంచ్ లను సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాస్ మాట్లాడుతూ .. గ్రామాలలో సర్పంచులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని ఏవైనా సమస్యలు ఉంటే తనతో చర్చించాలని సూచించారు.
గ్రామ సర్పంచులకు తెలియని విషయాలు ఉంటే తమకు సంప్రదించి తెలుసుకోవాలని నూతనంగా ఎన్నికైన సర్పంచులు అంతా కొత్తవారి కాబట్టి ప్రతి ఒక్క విషయం పరిగణలో తీసుకొని గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. అదేవిధంగా కామారెడ్డి జిల్లా జెడ్పి సీఈఓ చంద్రనాయక్ మాట్లాడుతూ గ్రామాలలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలలో సర్పంచుల పాత్ర కీలకమని అన్నారు. ప్రతి సర్పంచులు గ్రామాల అభివృద్ధికి తమ వంతుగా కృషిచేసి జిల్లా కేంద్రానికి ఆదర్శంగా జుక్కల్ మండలం నిలవలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా జెడ్పి సీఈఓ, జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ , ఎమ్మార్వో మారుతి, మండల వ్యవసాయ అధికారులు మహేశ్వరి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శ్రీకాంత్ రెడ్డి, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.




