Sunday, November 9, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్జెడ్పీ రిజర్వేషన్లు ఖరారు

జెడ్పీ రిజర్వేషన్లు ఖరారు

- Advertisement -

ఎస్టీలకు 4, ఎస్సీలకు 6, బీసీలకు 13
జనరల్‌ కేటగిరీలో 8 జిల్లాలు
మహిళలకు 15 జెడ్పీ పీఠాలు కేటాయింపు


నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
జెడ్పీ చైర్మెన్‌, చైర్‌పర్సన్ల రిజర్వేషన్లకు సంబంధించిన గెజిట్‌ను రాష్ట్ర సర్కారు విడుదల చేసింది. ఎస్టీలకు 4, ఎస్సీలకు 6, బీసీలకు 13, జనరల్‌ కేటగిరికి 8 జెడ్పీ పీఠాలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నది. 15 జిల్లాలను మహిళలకు కేటాయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌ సృజన ఒక ప్రకటన విడుదల చేశారు. ఖమ్మం, వరంగల్‌ (ఎస్టీ), ములుగు, నల్లగొండ(ఎస్టీ మహిళ)కు కేటాయించబడ్డాయి. ఎస్సీ మహిళలకు రంగారెడ్డి, హన్మకొండ, జనగామ, ఎస్సీజనరల్‌ కేటగిరిలో జోగులాంబ గద్వాల, రాజన్నసిరిసిల్ల, సంగారెడ్డి జెడ్పీ పీఠాలను ఖరారు చేశారు. బీసీ జనరల్‌ కేటగిరీలో జయశంకర్‌ భూపాలపల్లి, కరీంనగర్‌, కొమ్రంభీం అసిఫాబాద్‌, నిర్మల్‌, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్‌ జిల్లాలున్నాయి. బీసీ మహిళల కోటాలో మహబూబ్‌నగర్‌, మంచిర్యాల, నాగర్‌కర్నూల్‌, నిజామాబాద్‌, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాలున్నాయి. జనరల్‌ మహిళ కేటగిరీలో ఆదిలాబాద్‌, జగిత్యాల, నారాయణపేట, పెద్దపల్లి, జనరల్‌ కోటాలో భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, మహబూబాబాద్‌, మెదక్‌ జిల్లాలున్నాయి. ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీల రిజర్వేషన్ల వివరాలను జిల్లాల వారీగా విడుదల చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -