Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంజమ్మూకశ్మీర్‌‌లో టూరిస్టులే టార్గెట్‌గా భయంకరమైన కాల్పులు

జమ్మూకశ్మీర్‌‌లో టూరిస్టులే టార్గెట్‌గా భయంకరమైన కాల్పులు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : జమ్మూకశ్మీర్‌లో మరోసారి ఉగ్రమూకలు రెచ్చిపోయాయి. పహెల్‌గామ్ లో టూరిస్టులే టార్గెట్‌గా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆరుగురికి బుల్లెట్ గాయాలు అయ్యాయి. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలిసిన వెంటనే భద్రతా బలగాలు ఘటనా స్థలానికి వచ్చాయి. ప్రస్తుతం కాల్పులు జరిపిన స్పాట్‌లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. కాగా, ఇటీవలే దేశంలో ఉగ్రదాడులు జరగవచ్చని నిఘా సంస్థలు హెచ్చరికలు చేశాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులకు దిగొచ్చని హెచ్చరించాయి. ఈ క్రమంలో రైల్వేశాఖను అప్రమత్తం చేశాయి. డ్రోన్‌, ఐఈడీతో దాడులు జరగవచ్చని వెల్లడించాయి. నదీమార్గాల్లో తీవ్రవాదులు చొరబడవచ్చని చెప్పాయి. ముంబయి ఉగ్రదాడి కీలక కుట్రదారు తహవ్వుర్ రాణాను అమెరికా నుంచి భారత్‌కు తీసుకువచ్చి విచారిస్తోన్న తరుణంలో ఈ అలర్ట్ రావడం గమనార్హం.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad