– సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దేవేందర్
నవతెలంగాణ-షాబాద్
అంగన్‌వాడీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దేవేందర్ అన్నారు. బుధవారం షాబాద్‌లో అంగన్‌వాడీ టీచర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గత 40 ఏండ్ల నుంచి ఐసీడీఎస్లో 70 వేల మంది అంగన్‌వాడీ టీచర్లు పని చేస్తున్నారని తెలిపారు. వారికి ఉద్యోగ భద్రత లేదని, ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యాలు, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ వంటి అనేక సౌకర్యాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫల మైందన్నారు. అంగన్ వాడీలు అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటూ, వీధులు నిర్వహిస్తున్నారనీ,వారందరికీ ప్రభుత్వం మార్చి లోగా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని యేడల మార్చి నెలలో రాష్ట్రవ్యాప్తంగా సమ్మె నిర్వహి స్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు ఉన్నారు.