అంతిమ అధికారం సుప్రీంకోర్టుదే అనడం సరికాదు

– ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధంఖర్‌
న్యూఢిల్లీ : రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని పార్లమెంటు మార్చజాలదనీ, ఈ విషయంలో సుప్రీంకోర్టుకు మాత్రమే అంతిమ అధికారం ఉందని చెప్పడం సరికాదని ఉప రాష్ట్రపతి జగ్‌దీప్‌ ధంఖర్‌ అన్నారు. 1973లో సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసులో ఇచ్చిన తీర్పులో దీనిని చెప్పిందనీ తెలిపారు. రాజస్థాన్‌ విధాన సభలో బుధవారం జరిగిన 83వ అఖిల భార త ప్రిసైడింగ్‌ అధికారుల సమావేశంలో ఉప రాష్ట్రపతి జగ్‌దీప్‌ ధంఖర్‌ పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో లోక్‌సభ సభాపతి ఓం బిర్లా, రాజ స్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ కూడా పాల్గొన్నారు. 1973లో సుప్రీం కోర్టు కేశవానంద భారతి కేసులో ఇచ్చిన తీర్పు చెడు దృష్టాంతంగా నిలు స్తోందన్నారు. ఈ తీర్పును తాను సమర్థించబోనన్నారు. ‘మౌలిక నిర్మాణం’, ‘రాజ్యాంగ ప్రాథమిక శిల్పం’ అని చెప్తున్న దానిని రాజ్యాంగ సవరణలు ఉల్ల ంఘించినట్టు ప్రకటిస్తూ, ఆ రాజ్యాంగ సవరణలను రద్దు చేసే అధికారాన్ని మొదటిసారి కేశవానంద భారతి తీర్పులోనే సుప్రీంకోర్టు సృష్టించిందని అన్నారు. ఆ తరువాతి కాలంలో ఈ మౌలిక నిర్మాణానికి చాలా ముఖ్యమైన విగా చెప్తూ అనేక ముఖ్యమైన రూలింగ్స్‌ను సుప్రీంకోర్టు ఇచ్చిందన్నారు. ఈ ప్రక్రియలో పార్లమెంటరీ సార్వభౌమాధికారానికి హాని జరిగిందన్నారు.

Spread the love