అందరూ చూడాల్సిన సినిమా

విజయనిర్మల మనవడు శరణ్‌ కుమార్‌ హీరోగా, శశిధర్‌ చావలి దర్శకత్వంలో తెరకెక్కిన యూత్‌ ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘మిస్టర్‌ కింగ్‌’. హన్విక క్రియేషన్‌ బ్యానర్‌ బి.ఎన్‌.రావు నిర్మించారు. యశ్విక నిష్కల, ఊర్వీ సింగ్‌ కథానాయికలుగా నటించారు. ఈ నెల 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ ప్రెస్‌ మీట్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో శరణ్‌ కుమార్‌ మాట్లాడుతూ, ‘మణిశర్మ ఇచ్చిన మ్యూజిక్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. టీజర్‌కి వచ్చిన రెస్పాన్స్‌ కూడా గొప్ప సంతోషాన్ని ఇచ్చింది. ఈ చిత్రాన్ని ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ఈ సినిమా కోసం యూనిట్‌ అంతా చాలా హార్డ్‌ వర్క్‌ చేశాం. నిర్మాత బిఎన్‌ రావు ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. శశి అద్భుతంగా డైరెక్ట్‌ చేశారు. యశ్విక నిష్కల, ఊర్వీ సింగ్‌ మంచి పెర్‌ఫార్మెన్స్‌ ఇచ్చారు. సునీల్‌, తనికెళ్ళ భరిణి, మురళి శర్మ, వెన్నెల కిషోర్‌ లాంటి సీనియర్లతో పని చేయడం గొప్ప అనుభవం. వాళ్ళ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇది నా మొదటి సినిమా. మీ అందరి సపోర్ట్‌, ప్రేమ కావాలి’ అని తెలిపారు. ‘ఆత్మగౌరవం ఉన్న ప్రతి అబ్బాయి చూడాల్సిన సినిమా ఇది. ఆడ పిల్ల ఉన్న ప్రతి కుటుంబం చూడాల్సిన సినిమా. గత రెండు రోజులుగా సినిమా ప్రొజక్షన్‌ చేసినపుడు వచ్చిన స్పందన గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. సెన్సార్‌ వాళ్ళు క్లైమాక్స్‌ చూసి, వాళ్ళ పాప గుర్తు వచ్చిందని చెప్పడం భావోద్వేగాన్ని కలిగించిది. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది థియేటర్‌కి వచ్చిన వారు ఖచ్చితంగా ఎంజారు చేస్తారు’ అని దర్శకుడు శశిధర్‌ చెప్పారు. నాయిక యశ్విక నిష్కల మాట్లాడుతూ, ‘ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కతజ్ఞతలు. అందరూ చూడాల్సిన సినిమా ఇది. మీ అందరి ప్రోత్సాహం కావాలి’ అని అన్నారు. ‘మంచి టీంతో కలిసి పనిచేయడం గొప్ప సంతోషాన్ని ఇచ్చింది. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇందులో నా పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఈ సినిమాతో మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నాను’ అని మరో నాయిక ఊర్వీ సింగ్‌ అన్నారు.
       మా దర్శకుడు చెప్పినట్టు ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది. ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ నెల 24న విడుదల
అవుతున్న మా చిత్రాన్ని అందరూ థియేటర్‌లో చూసి, ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

– నిర్మాత బి.ఎన్‌.రావు

Spread the love