అగ్నిపథ్‌కు గురుకుల విద్యార్థుల ఎంపిక

నవతెలంగాణ – హైదరాబాద్‌
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ గురుకులాల నుంచి నలుగురు విద్యార్థులు అగ్నిపథ్‌కు ఎంపికైనట్టు గురుకులాల కార్యదర్శి రోనాల్డ్‌ రోస్‌ తెలిపారు. అగ్నివీరులుగా మాలోత్‌ జవేందర్‌, బానోతు రాము, వేల్పుల అజయ్‌, ఇస్లావత్‌ నరేశ్‌ ఎంపికైనట్టు వెల్లడించారు. ఆర్మీ పరీక్షల్లో వీరు ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. గురుకులాల్లో ఎన్‌సీసీ అమలు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతున్నదని చెప్పారు. ఈ సందర్భంగా ఈ నలుగురు విద్యార్థులను రోనాల్డ్‌ రోస్‌, అదనపు కార్యదర్శి వీ సర్వేశ్వర్‌రెడ్డి అభినందించారు.

Spread the love