”ఎలుకరాజా గ్రామంలోని రైతు మమ్మల్ని పట్టుకొన్నాడు. అదష్టం కొద్దీ మేము ప్రాణాలతో బయటపడ్డాము”
”మీరెలా తప్పించుకొన్నారు”
”ఇంతకుముందు ఎలుకబోనులో ఒక ఎలుకను మాత్రమే పట్టుకొనేవారు. ఇప్పుడు ఆ రైతు భూమిలో పాతిపెట్టిన ఎలుకబోనులో ఎన్ని ఎలుకలైనా పడిపోతున్నాయి. మేము చాలా మంది ఆ బోనులో పడిపోయాము. పైకి రావడానికి మార్గం లేకపోయింది. ఆ రైతు వచ్చాడంటే మా ప్రాణం తీస్తాడనుకొన్నాము. ఆ రైతు వచ్చి మా వైపు చూసి ఏమన్నాడో తెలుసా”
” ఏమన్నాడు” అడిగాడు ఎలుకల రాజు.
”మమ్మల్ని పాలించే పాలకులు, అధికారులు, చదువుకొన్న వారు, ప్రజలు అర్థంచేసుకోలేదంటే వినాయకుడి వాహనమైన మీరు కూడా వారిలాగే ప్రవర్తించడం చాలా బాధగా వుంది. ఈ రోజు సంక్రాంతి, మా రైతుల పండుగ రోజు. పంటను నాశనం చేసే మిమ్మల్ని సంక్రాంతి రోజు చంపడానికి మనసు రాలేదు. ఇంకొకరోజు దొరికారంటే నేను చంపేస్తాను. అంటూ వదిలేసాడు” అంటూ గట్టిగా ఊపిరిపీల్చి వదిలింది ఎలుక.
”ఆ రైతు చెప్పింది నిజం. అందరూ అతనికి అన్యాయం చేస్తున్నారు”
”మేము తినే ఆ కొద్దీ పాటి ధాన్యం వల్ల ఆ రైతు జీవితం ముగిసిపోతుందా”
”అందరూ అలా అనుకొంటూనే అతని జీవితాన్ని అంతం చేస్తున్నారు. పాపం నీటి కోసం ఎంతగా ఇబ్బంది పడుతున్నాడో తెలుసా ”
”చెరువు ఉందిగా, ఆ నీటిని పంటలకు ఉపయోగించవచ్చుగా”
”చెరువులన్నీ పాలకులు, అధికారులు ఆక్రమించుకొని ఇళ్లు కట్టుకున్నారు. ఇప్పుడు ఆ రైతులు అడిగితే ఆ ఇళ్లను ఖాళీ చేయించలేము అంటూ నిర్భయంగా చెబుతున్నారు. రైతులు నీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు.”
”చదువుకొన్నవారు ఎలా అన్యాయం చేస్తున్నారు ఎలుకరాజా”
”తమ ఆకలిని తీర్చడానికి చాలా కష్టపడి చెమటోడ్చి పండించిన రైతుకు విలువ ఇవ్వడం మరచిపోయారు. రైతు పండించిన పోషక విలువలున్న పండ్లను తినడం, కొబ్బరి బోండాలు తాగడం మరచి, విషతుల్యమైన చల్లని పానీయములను ఎక్కువ ఖరీదుతో ఈ కాలం చదువుకున్నవారు కొంటున్నారు”
”వారందరిలో మార్పురాదా ఎలుకరాజా”
”మనలోనే మార్పు రానప్పుడు ఇక ఆ మానవుల గురించి ఆలోచించడం సరికాదు”
”ఆ రైతు కష్టానికి ఉడుత సాయంగా మనం ఈ పల్లెటూరు విడిచి అడవికెళ్లి జీవిద్దాం” అంది ఒక ఎలుక.
ఆ మాటలకూ అన్ని ఎలుకలు గట్టిగా ”అవును అడవికి వెళ్దాము” అన్నాయి.
”పాలకులలో, అధికారులలో ప్రజలలో చదువుకున్నవారిలో మార్పు ఎప్పుడు వస్తుందో చెప్పలేను. ఇప్పుడు మీలో మార్పు కలగడం నాకు సంతోషముగా వుంది” అంటూ ఎలుకరాజు అన్ని ఎలుకలవైపు చూస్తూ చేతులెత్తి నమస్కారం చేసాడు.
ఎలుకలు అడవికి వెళ్తూ పొలంలో రైతు తన కష్టాలను మరచి కుటుంబ సభ్యులతో సంక్రాంతి పండుగ జరుపుకోవడం చూసి సంతోషించింది .
– ఓట్ర ప్రకాష్‌రావు, 09787446026