– ఎస్టీయూటీఎస్ నేతలకు సీఎస్ హామీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నూతన సంవత్సరం కానుకగా అతిత్వరలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఎస్టీయూటీఎస్ నేతలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్‌కుమార్ హామీ ఇచ్చారు. సోమవారం హైదరాబాద్‌లో సీఎస్‌ను ఎస్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జి సదానందంగౌడ్, ప్రధాన కార్యదర్శి ఎం పర్వత్‌రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి బి భుజంగరావు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. బదిలీలు, పదోన్నతులు చేపడతామంటూ చెప్పడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 317 జీవో బాధితులకు న్యాయం చేయాలని కోరారు. రాష్ట్రంలో ఏడున్నర ఏండ్లుగా పదోన్నతులు, నాలుగేండ్లుగా బదిలీల్లేక ఉపాధ్యాయులు ఎంతో ఆవేదన చెందుతున్నారని తెలిపారు.