– వెస్టిండీస్‌పై ఆరు వికెట్ల తేడాతో గెలుపు
– ఐసీసీ మహిళల టి20 ప్రపంచకప్
కేప్‌టౌన్: ఐసీసీ మహిళల టి20 ప్రపంచకప్‌లో భారత జట్టు వరుసగా రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై 7వికెట్ల తేడాతో నెగ్గిన టీమిండియా.. బుధవారం జరిగిన గ్రూప్-బి రెండో లీగ్ మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తుచేసింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 118పరుగులు చేసింది. ఛేదనలో టీమిండియా 18.1 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 119పరుగులు చేసి విజయం సాధించింది. దీంతో గ్రూప్-బిలో భారత్ 4పాయింట్లతో రెండోస్థానంలో నిలిచింది.5