అనుకున్నది సాధించాలంటే

యువ కథానాయకుడు శ్రీ సింహా నటిస్తున్న తాజా చిత్రం ‘భాగ్‌ సాలే’. గురువారం తన పుట్టినరోజు సందర్బంగా ఈ చిత్ర టీమ్‌ ఒక స్పెషల్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. ప్రణీత్‌ సాయి దర్శకత్వంలో క్రైమ్‌ కామెడీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వేదాన్ష్‌ క్రియేటివ్‌ వర్క్స్‌ బ్యానర్‌ పై బిగ్‌ బెన్‌, సినీ వ్యాలీ మూవీస్‌ వారి అసోసియేషన్‌తో అర్జున్‌ దాస్యన్‌, యష్‌ రంగినేని, కళ్యాణ్‌ సింగనమల నిర్మిస్తున్నారు.అనుకున్నది సాధించాలనుకునే ఒక యువకుడి పాత్ర చుట్టూ తిరిగే ఈ కథ ఆద్యంతం థ్రిల్లింగ్‌గా ఉంటుంది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణంతర కార్యక్రమాలు జరుపుకుంటూ విడుదలకి సిద్ధంగా ఉంది.

Spread the love