అన్ని వర్గాలకు ప్రాధాన్యం

– రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మెన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించకుండా ఆర్థిక దిగ్బంధనం చేసినా రాష్ట్ర ప్రభుత్వం తన సొంత రాబడి నుంచి గణనీయంగా ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నదనిరాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మెన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్‌ తెలిపారు. అసెంబ్లీలో ప్రవేశపట్టిన బడ్జెట్‌ దీన్ని ప్రతిబింబిస్తున్నదని ప్రసంశించారు. అభివద్ధి, సంక్షేమ రంగాలకు సమ ప్రాధాన్యత ఇచ్చారన్నారు. రెవెన్యూ రాబడి గణనీయంగా పెరిగిందనీ. ముఖ్యంగా స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ విభాగంలో రూ. 18,500 కోట్లు, ఎక్సైజ్‌ లో రూ. 20,000 కోట్లు, రోడ్‌ ట్రాన్స్‌ పోర్ట్‌ లో రూ. 7,512 కోట్లు, మైనింగ్‌ లో రూ. 5,917 కోట్ల రాష్ట్ర ఆదాయం సమకూరిందని వివరించారు.

Spread the love