అభిమానాన్ని చాటుకున్న ఎస్ఐ అరుణ

  • డ్రైవర్ నాగేంద్ర కూతురు బర్త్ వేడుకలకు హాజరు
    నవతెలంగాణ – అశ్వారావుపేట
    రోజూ తన దగ్గర పనిచేసిన వారిని సైతం ఆ కొద్ది సేపే గుర్తుంచుకునే ఈ రోజుల్లో కూడా ఎపుడో తన దగ్గర పనిచేసిన వరిని గుర్తుంచుకోవడం అరుదనే చెప్పుకోవాలి. గతేడాది వరకు అశ్వారావుపేట లో ఎస్.ఐ గా విధులు నిర్వహించిన చల్లా అరుణ అప్పట్లో తన వాహనానికి డ్రైవర్ గా పనిచేసిన మండల పరిధి లోని ఆసుపాక కు చెందిన వీర్నాల నాగేంద్ర – భార్గవి దంపతుల ఏకైక కుమార్తె లిఖిత పుట్టిన రోజు రోజు వేడుకలకు ఆమెను ఆహ్వానించడంతో ఆదివారం వినాయకపురం చిలకల గండి ముత్యాలమ్మ తల్లి ఆలయ సన్నిధిలో ఘనంగా జరిగిన ఈ పుట్టినరోజు వేడుకల్లో ఎస్ఐ చల్లా అరుణ ముఖ్య అతిథిగా హాజరయ్యి చిన్నారిని ఆశీర్వదించారు. అనంతరం ముత్యాలమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
Spread the love