అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మంత్రికి వినతి

నవతెలంగాణ-బడంగ్‌ పేట్‌
జల్‌ పల్లి మున్సిపల్‌ పరిధిలో ఉన్న శ్రీరాం కాలనీ అభివద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరుతూ బుధవారం కౌన్సిలర్లు కే.లక్ష్మినారాయణ,పల్లపు శంకర్‌లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీరాం కాలనీ ఏర్పడి ఎన్నో ఏండ్లు గడుస్తున్నా అభివద్ధికి నోచుకోలేదని తెలిపారు. అన్ని రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వలస వచ్చి ఇక్కడ జీవిస్తున్నారన్నారు. మిని ఇండియాగా పేరున్నా అభివద్ధిలో మాత్రం ఆమడ దూరంలో ఉందన్నారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. మంత్రి అందుకు సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు.

Spread the love