అభివృద్ధి పనులకు శంకుస్థాపన

నవతెలంగాణ-కంటోన్మెంట్‌
కంటోన్మెంట్‌ బోర్డు ఆరోవార్డులో ఆదివారం కంటోన్మెంట్‌ బోర్డు నామినేటెడ్‌ సభ్యుడు రామకష్ణ, మాజీ ఉపాధ్యక్షురాలు భానుక నర్మదా మల్లికార్జున్‌ కాలనీ వాసులతో కలిసి అభివద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ.25 లక్షల వ్యయంతో మారుతీనగర్‌ సాయిబాబా కాలనీ, భవానీనగర్‌ కాలనీలో మంచినీటి పైపులైన్‌ పనులు ప్రారంభించారు. శ్రీనివాస్‌నగర్‌లో రూ.40 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నామినేటెడ్‌ సభ్యుడు రామకష్ణ మాట్లాడుతూ ఆరో వార్డును అభివద్ధి చేసేందుకు కషి చేస్తున్నట్టు చెప్పారు. రామన్నగుంట చెరువు సమస్య కూడా త్వరలో పరిష్కరిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి కంటోన్మెంట్‌కు ఎలాంటి సహకారం అందటం లేదన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్‌ నగర్‌ కాలనీ సాయిబాబా నగర్‌ కాలనీ కార్యవర్గసభ్యులు టి.శంకర్‌గౌడ్‌, గడ్డం పాపయ్యయాదవ్‌, బెల్లంపల్లి వెంకటేష్‌, డాక్టర్‌ రజనీకాంత్‌, కె.అశోక్‌, కష్ణగౌడ్‌, రజనీకాంత్‌, గోపాల్‌గౌడ్‌, గోవర్ధన్‌, బాలగంగాధర్‌, వాసిరెడ్డి, నందమయ్య గౌడ్‌, బండి గోపాల్‌ గౌడ్‌, అమర్నాథ్‌ యాదవ్‌, రాములు, సతీష్‌, నాగభూషణం, పాండు, నారాయణ, రాహుల్‌, శ్రీనివాస్‌ స్వరూప, పద్మ, శోభ, భారతి, చందన, భావన, రాధిక, పుష్ప తదితరులు పాల్గొన్నారు.

Spread the love