అమిగోస్‌.. మిమ్మల్ని నిరుత్సాహపరచదు

కళ్యాణ్‌ రామ్‌ త్రిపాత్రిభినయంలో నటించిన తాజా చిత్రం ‘అమిగోస్‌’. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 10న గ్రాండ్‌ లెవల్లో సినిమా రిలీజ్‌ కానుంది. శుక్రవారం ఈ చిత్ర ట్రైలర్‌ను కర్నూలులో చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో యలమంచిలి రవి శంకర్‌ మాట్లాడుతూ, ‘సినిమా మేం చూశాం. ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చింది. రాజేందర్‌ రెడ్డి తొలి సినిమానే అయినప్పటికీ అత్యద్భుతంగా తెరకెక్కించాడు. సౌందర్‌ రాజన్‌ అద్భుతమైన విజువల్స్‌ ఇచ్చారు. కళ్యాణ్‌ రామ్‌ పెర్ఫామెన్స్‌ నెక్ట్స్‌ లెవల్‌లో ఉంటుంది. హీరోయిన్‌ ఆషికా రంగనాథ్‌ చక్కగా నటించింది. ఫస్టాఫ్‌ చాలా బావుంది. సెకండాఫ్‌ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. సినిమాను ఆసాంతం ఆస్వాదిస్తారు’ అని తెలిపారు. ‘2022లో బింబిసార సినిమాతో మీ ముందుకు వచ్చాను. కొత్త సినిమాలను చేసిన ప్రతీసారి ప్రేక్షకులు ఆదరిస్తూనే వచ్చారు. ముగ్గురు మధ్య జరిగే కథ ఇది. థియేటర్‌లో మీరు డిసప్పాయింట్‌ కారు. మీరు మాపై చూపించే అభిమానానికి ఇంకో సూపర్‌ హిట్‌ సినిమా రాబోతుంది. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు తమ్ముడు తారక్‌ గెస్ట్‌గా వస్తున్నాడు’ అని కళ్యాణ్‌ రామ్‌ చెప్పారు.

Spread the love