ఆమని, మానస్ తల్లీకొడుకులుగా నటించిన ఎమోషనల్ హార్ట్ టచింగ్ సాంగ్ ‘నువ్వే కావాలి అమ్మ’. మౌనీస్ కుమార్ కల్ల సంగీత సారథ్యంలో, సందీప్ సన్ను దర్శకత్వంలో ఈ పాటను జ్యోతి కున్నూరు నిర్మించారు. ‘మా’ ఇసి మెంబర్ శైలజ, ఆమని, పద్మిని నాగులపల్లితోపాటు నిర్మాత జ్యోతి కున్నూరు ఈ పాటను నివ్రితి వైబ్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేశారు. మాదాల రవి, ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ బసిరెడ్డి, నిర్మాత బెక్కం వేణుగోపాల్, మ్యూజిక్ డైరెక్టర్స్ రఘు కుంచె, మదీన్, కాశర్ల శ్యామ్, హీరో సుధాకర్, ఈ సి మెంబర్ శ్రీనివాస్, కాసర్ల శ్యామ్, శ్రీని ఇన్ఫ్రా శ్రీను, బిగ్ బాస్ ఫేమ్ హారిక, సింగర్ మధు ప్రియ, హాక్సా ఖాన్, తదితరులతో పాటు సాంగ్ చేసిన టీం అందరూ ఈ వేడుకలో పాల్గొన్నారు.నివతి వైబ్స్ నిర్మాత జ్యోతి కున్నూరు మాట్లాడుతూ, ‘మానస్‌తో మేం చేసిన ”జరీ జరీ” సాంగ్ చాలా బాగా హిట్ అయింది. ఆమని, మానస్‌తో తాజాగా మేం తీసిన ఈ ‘అమ్మ..’ పాటను అందరూ ఆదరించాలని కోరుతున్నాను. మా ద్వారా ఇంత మంచి పాటలు రావడానికి కారణం మా టీమ్ ఎఫెర్ట్. మరిన్ని మంచి పాటల కోసం ప్రయత్నిస్తున్నాం’ అని చెప్పారు. ‘అమ్మ సెంటిమెంట్‌తో సాగే ఈ పాట చాలా బాగా వచ్చింది’ అని ఆమని అన్నారు. దర్శకుడు సందీప్ మాట్లాడుతూ,’ఆమని, మానస్ బాగా చేశారు. మంచి లిరిక్స్ ఇచ్చిన రంజిత్‌కి, నివృతి వైబ్స్‌వారికి థ్యాంక్స్’ అని చెప్పారు.