ఒక్కోసారి ఏ కారణం లేకుండానే అంతరంగంలో అలజడిగా ఉంటుంది. ఏ పనీ చేయాలనిపించదు. సోమరితనం ఆవరించడమే కాదు.. ఏదో తెలియని విసుగు, అసహనం పట్టి పీడిస్తాయి. ఇలాంటి స్థితి ఎక్కువ రోజులు కొనసాగితే అది డిప్రెషన్‌కు దారితీసే ప్రమాదముంది. మరి దాన్నుంచి ఎలా బయట పడాలంటారా? అదేం పెద్ద కష్టమైన విషయం కాదు. అనుభవజ్ఞులు సూచిస్తున్న ఈ సూత్రాలను పాటిస్తే చాలు.. చిరాకు వల్ల చిన్న చిన్న కారణాలకే ఇంట్లో అందరి మీదా అరిచేస్తున్నారా? అర్జెంటుగా మొక్కల్లోకి వెళ్లిపోయి పూలూ కాయలను గమనించండి. వాటి మీద కొన్ని నీళ్లు మెల్లగా చిలకరించండి. ఆకుల మీద దుమ్మూధూళీ పోయి పచ్చగా మెరుస్తూ మీకు కృతజ్ఞత చెబుతున్నట్లే ఉంటాయి. మీ విసుగు ఎలా మాయమయ్యిందో కూడా తెలియకుండా ఆనందం ఆవరిస్తుంది. ఇష్టమైన పరిమళభరిత సబ్బుతో నచ్చినంతసేపు స్నానం చేయండి. మనసూ, శరీరం కూడా సేదతీరతాయి. హాస్యప్రవృత్తి ఉన్న బంధుమిత్రులతో కాసేపు కులాసాగా మాట్లాడండి. చిరాకూ పరాకూ హుష్ కాకీ అయిపోతాయి. చీర లేదా కర్టెన్ మీద మీకు తోచినట్లు ఫ్యాబ్రిక్ పెయింట్ వేయండి. ప్రొఫెషనల్స్‌తో పోల్చుకుని అద్భుతంగా రాలేదని దిగులు పడొద్దు. అది మీ రంగం కాకపోయినా ఎంత బాగా వేశాను కదా అనుకోండి. అనిర్వచనీయమైన ఆనందం సొంతమవుతుంది. కాళ్లు, చేతులు, మెడ, నడుము.. అన్నిటినీ వంచుతూ కాసేపు వ్యాయామం చేయండి. లేదంటే అరగంట సేపు వేగంగా నడవండి. ఎక్కడ లేని హుషారూ వస్తుంది. కొంతసేపు ఫొటో ఆల్బమ్స్ చూడండి. పాత అనుభవాలను నెమరేసుకోవడంతో ప్రస్తుత అలసట, ఆందోళనలు పరారైపోతాయి. ఇవేవీ కాదంటే ఎక్కడి పనులు అక్కడ ఆపేసి పడగ్గదిలో రూమ్ ఫ్రెష్‌నర్ స్ప్రే చేసుకుని నిద్రకు ఉపక్రమించండి. కొత్త ఉత్తేజం వచ్చి చేరుతుంది. ప