అలరిస్తున్న మళ్ళీ.. మళ్ళీ

అఖిల్‌ అక్కినేని, దర్శకుడు సురేందర్‌ రెడ్డి క్రేజీ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ ‘ఏజెంట్‌’. ఈ వేసవి సీజన్‌లో బిగ్గెస్ట్‌ ఎట్రాక్షన్‌లో ఒకటిగా ఏప్రిల్‌ 28న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్‌ చేయబోతున్నారు. హిప్‌ హాప్‌ తమిళ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రంలోని మొదటి సింగిల్‌ ‘మళ్ళీ మళ్ళీ’ పాటని మేకర్స్‌ బుధవారం విడుదల చేయగా, ఈ పాటను అక్కినేని ఫ్యాన్స్‌ ట్విట్టర్‌ ద్వారా రిలీజ్‌ చేశారు. ఈ పాట విడుదల నేపథ్యంలో మొదటిసారిగా అఖిల్‌ ట్విట్టర్‌ స్పేస్‌లలో అభిమానులతో ఇంటరాక్ట్‌ అయ్యారు. ‘యూనిక్‌ స్టయిల్‌లో లాంచ్‌ చేసిన ఈ పాట ఇప్పటికే ప్రోమో వెర్షన్‌తో ప్రజాదరణ పొందింది. పూర్తి వెర్షన్‌ విన్నర్‌గా నిలిచింది. ఈ ఫుట్‌-ట్యాపింగ్‌ నెంబర్‌కి క్లాసిజం టింజ్‌ ఉంది. మైల్డ్‌ బాస్‌ వర్క్‌ పాటకు హైలెట్‌. హిప్‌-హాప్‌ తమిళ వినగానే, ఆకట్టుకునే నెంబర్‌ని కంపోజ్‌ చేశారు. అఖిల్‌ ఈ పాటలో లవ్లీ ఎక్స్‌ ప్రెషన్స్‌, ఎట్రాక్టివ్‌ డ్యాన్స్‌మూవ్స్‌తో ఆకట్టుకుంటే, సాక్షి వైద్య అందంగా కనిపించింది. బ్యూటీఫుల్‌ ఫారిన్‌ లొకేషన్స్‌లో షూట్‌ చేసిన విజువల్స్‌ కళ్లు చెదిరేలా ఉన్నాయి. సురేందర్‌ రెడ్డి మునుపెన్నడూ చూడని క్యారెక్టర్‌లో అఖిల్‌ని ప్రెజెంట్‌ చేస్తున్నారు. మమ్ముట్టి కీలక పాత్ర చేస్తున్నారు. సురేందర్‌ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు’ అని చిత్రయూనిట్‌ తెలిపింది.

Spread the love