అవినీతే అతి పెద్ద శత్రువు : ద్రౌపది ముర్ము

– రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించిన బీఆర్‌ఎస్‌,ఆప్‌
న్యూఢిల్లీ : ప్రజాస్వామ్యానికి, సామాజిక న్యాయానికి అవినీతే అతి పెద్ద శత్రువు అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లోక్‌సభ, రాజ్యసభ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి మంగళవారం ప్రసంగించారు. వరుసగా రెండుసార్లు సుస్థిర ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు దేశ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ దేశ ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తుందనీ, విధానపరమైన వ్యూహాన్ని సమూలంగా దేశాన్ని పూర్వ వైభవం, ఆధునిక కాలపు సువర్ణాధ్యాయాల అనుసంధానంతో నిర్మించాలని ఆకాంక్షించారు. నేడు ప్రతి భారత పౌరుడు ఆత్మ విశ్వాసం అత్యున్నత స్థాయిలో ఉందన్నా రు

 

Spread the love