ఆదానీపై దర్యప్తు జరిపించాలి-ఎమ్మెల్సీ కవిత

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
అదానీ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఎమ్మెల్సీ కే కవిత డిమాండ్‌ చేశారు. దీనిపై ప్రధాని మౌనంగా ఎందుకు ఉంటున్నారో చెప్పాలన్నారు. రూ. 10 లక్షల కోట్ల దేశ ప్రజల సంపద ఆవిరయితే, అంతా బాగేనే ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఎలా అంటారని ప్రశ్నించారు. ఏ ప్రభుత్వ మద్దతుతో ఆదానీ రూ. 60 వేల కోట్ల నుంచి రూ. 10 లక్షల కోట్లకు వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారో ప్రజలందరికీ తెలుసన్నారు. శాసనమండలి ఆవరణలో సోమవారంనాడామె మీడియాతో మాట్లాడారు. అదానీ వ్యవహారంపై ప్రధాని ప్రజల ముందుకొచ్చి వివరణ ఇవ్వాలనీ, దీనిపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ బడ్జెట్‌ దేశానికి స్పూర్తిదాయకమని చెప్పారు. ప్రధాన మంత్రి మోడీ మద్దతుతో ఆదానీ అపారమైన సంపదను కూడబెట్టిన విషయం ప్రపంచమంతా తెలుసునని అన్నారు. దామాషా ప్రకారం సామాజిక రంగంలో ఆయా వర్గాల జనాభాకు అనుగుణంగా కేటాయింపులు ఉన్నాయన్నారు.

 

Spread the love