ఆద్యంతం వినోదభరితం

ఫుల్‌ మూన్‌ మీడియా ప్రొడక్షన్స్‌ పతాకంపై తమ తొలి ప్రయత్నంగా బిగ్‌ బాస్‌ ఫేమ్‌ వి.జె.సన్నీ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ గురువారం ప్రారంభమైంది. శివన్నారాయణ, శైలజ ప్రియ, సప్తగిరి, రేఖ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రైటర్‌ సంజరు ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వి. జయశంకర్‌ దర్శకత్వ పర్యవేక్షణలో ఒక అద్భుతమైన వినోదాత్మక చిత్రంగా రూపొందనుంది. ఈ సందర్భంగా ఫుల్‌ మూన్‌ మీడియా ప్రొడక్షన్స్‌ సంస్థ అధినేతలు మాట్లాడుతూ,’గురువారం నుంచి కంటిన్యూ షెడ్యూల్‌ ఉంటుంది. సింగిల్‌ షెడ్యూల్‌లో సినిమాను కంప్లీట్‌ చేయడానికి ప్లాన్‌ చేశాం. ఎంతో ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణులు మా చిత్రానికి పని చేస్తున్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాకారులు, దర్శకులు, నిర్మాతలను కనెక్ట్‌ చేసే టాలెంట్‌-స్కౌటింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ‘హంట్‌4మింట్‌’తో చేతులు కలపడం మాకు ఎంతో ఆనందంగా ఉంది’ అని తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : శ్రీనివాస్‌ రెడ్డి, ఎడిటర్‌: కార్తీక్‌ శ్రీనివాస్‌, సంగీతం: మదీన్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌: రాజీవ్‌ నాయర్‌.

Spread the love